ఈ ట్రాక్టర్ ట్రాలి చెత్త సేకరణకా... బట్టలు ఆరేసేందుకా..?
కొన్ని ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న మున్సిపలిటీ చెత్త ట్రాక్టర్లను స్థానిక ప్రజలు వారికి ఇష్టం వచ్చినట్లుగా ఉపయోగించుకుంటున్నారు.
దిశ, మంచిర్యాల: కొన్ని ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న మున్సిపలిటీ చెత్త ట్రాక్టర్ ట్రాలిలను స్థానిక ప్రజలు వారికి ఇష్టం వచ్చినట్లుగా ఉపయోగించుకుంటున్నారు. కొంత మంది పిల్లలు దాగుడు మూతలు ఆడడానికి ఉపయోగిస్తే, మహిళలు ఏకంగా బట్టలనే ఆరేసుకుంటున్నారు. ఎలాగయితేనేం ట్రాక్టర్ ట్రాలిని ఉపయోగిస్తున్నారు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీలో జరిగింది.
లక్షలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన ట్రాక్టర్ ట్రాలిలు చెత్త సేకరణకు వెళ్లకుండా నిరుపోయోగకంగా మారాయి. అధికారులు కూడా ఎవరూ పట్టించుకోక పోవడంతో స్థానిక ప్రజలు ట్రాక్టర్ ట్రాలిపై బట్టలు ఆరేస్తున్నారు. విలేజ్ నస్పూర్ లో ఇండ్ల మధ్యన మున్సిపల్ కార్యాలయం ఉండటంతో మున్సిపల్ వాహనాలను ఇండ్ల సమీపంలో పెడుతున్నారు. నిరుపయోగంగా ఉన్న వాహనాలను చూసి స్థానికులు అధికారుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.