ముగిసిన పెందూర్ ధర్ము పాదయాత్ర

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాణి మండల సమస్యల పరిష్కారం

Update: 2024-08-25 10:20 GMT

దిశ, తాండూర్ : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాణి మండల సమస్యల పరిష్కారం కోసం తిర్యాణి నుంచి హైదరాబాద్ వరకు ఆదివాసీ నేత పెందూర్ ధర్ము చేపట్టిన పాదయాత్ర శనివారం రాత్రి ముగిసింది. ఈనెల 15 న ధర్ము గాంధీ వేషధారణతో జాతీయ జెండా పట్టుకొని తిర్యానిలో పాదయాత్ర ప్రారంభించారు. శనివారం సిద్దిపేట వరకు ధర్ము పాదయాత్ర కొనసాగింది. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు చొరవ తీసుకొని దర్మును సచివాలయానికి తీసుకెళ్లి తెలంగాణ సీఎంవో కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డిని కలిసేలా చేశారు. దర్ము సీఎంవో కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డిని కలిసి జాతీయ జెండా ఇచ్చి మండలంలోని సమస్యలను వివరించి వినతిపత్రం అందజేశారు. త్వరలో ఆసిఫాబాద్ కలెక్టర్ తో కలిసి తిర్యాని మండలంలో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.


Similar News