వర్షం కోసం ఎదురుచూపులు..ఆందోళనలో పత్తి రైతులు

కుబీర్ మండలంలో పత్తి పంటను సాగు చేసిన రైతులు వర్షం కోసం

Update: 2024-10-15 10:07 GMT

దిశ,కుబీర్ : కుబీర్ మండలంలో పత్తి పంటను సాగు చేసిన రైతులు వర్షం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. మండలంలో 29,480 ఎకరాల్లో పత్తి పంట సాగయింది. కొన్ని రోజులుగా వర్షాలు ముఖం చాటేయడంతో పూత,కాత, సన్నని కాయలు సైతం రాలిపోతున్నాయి. గరప నేలల్లో సాగు చేసిన పత్తి ఎండిపోతున్నది. భూమి నేర్రెలు బాసింది.అత్యవసర పరిస్థితుల్లో వర్షాలు కురవకపోవడంతో చేతికి వచ్చిన పంట ఎండిపోతున్నది. పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ప్రైవేటు వ్యక్తులు క్వింటాకు రూ. 6850 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. పత్తి ధర క్వింటాకు రూ. 10,000 ధర ఉంటేనే గిట్టుబాటు అవుతుందని రైతులు అంటున్నారు.


Similar News