ఆ మున్సిపాలిటీలో అవినీతి రాజ్యం.. పైసలు ఇవ్వనిదే కదలని ఫైల్..

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కొరకు చెన్నూరు మేజర్ గ్రామపంచాయతీని స్థానిక ఎమ్మెల్యే బాల్కసుమన్ కృషితో గత నాలుగు సంవత్సరాల క్రితం మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసినారు.

Update: 2023-04-20 12:15 GMT

దిశ, చెన్నూర్ : కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కొరకు చెన్నూరు మేజర్ గ్రామపంచాయతీని స్థానిక ఎమ్మెల్యే బాల్కసుమన్ కృషితో గత నాలుగు సంవత్సరాల క్రితం మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసినారు. కానీ మున్సిపాలిటీ ఆఫీసు కార్యాలయంలో ఏ పని కావాలన్నా లంచాలు లేనిదే ఫైలు కదలడం లేదని డెత్, బర్త్ సర్టిఫికెట్లకు కూడా పేదప్రజలని చూడకుండా లంచాలు వసూలు చేస్తున్నారని పట్టణానికి చెందిన సమాచార హక్కుచట్టం చెన్నూర్ నియోజకవర్గ ప్రచార కమిటీ అధ్యక్షుడు ముత్యాల రవి అధికారుల తీరు పై మండిపడ్డాడు. గత నాలుగు సంవత్సరాల నుండి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆరుగురు కమిషనర్లు వివిధ కారణాలతో బదిలీల పై వెళ్లినారని తక్కువ సమయంలో ఆరుగురు కమిషనర్లు మారడం రాష్ట్రంలో ఎక్కడ లేదని, ప్రభుత్వభూములలో, లావాని పట్టా భూములలో ఎటువంటి పరిమిషన్లు లేకుండా అక్రమంగా అధికారుల అండదండలతో వెంచర్లు వేసి లక్షల రూపాయలు సంపాదించారని అన్నారు.

అవినీతి అధికారుల పై పలుమార్లు జిల్లాస్థాయి అధికారులకు వినతిపత్రాలు అందజేసినప్పటికీ ఎటువంటి స్పందన లేదని ఆయన విమర్శించారు. మేజర్ గ్రామపంచాయతీ నుండి మున్సిపాలిటీగా బోర్డు మారినప్పటికీ చెన్నూరు పట్టణ ప్రజలకు ఒరిగిందేమీ లేదని కార్యాలయంలో ఏ పని కావాలన్నా లంచాలు లేనిదే పని జరగదని ఆయన దుయ్యబట్టారు. కొత్తగా విధుల్లోకి చేరిన మున్సిపల్ కమిషనర్ బాధ్యతారాహిత్యంగా పనిచేస్తున్నారని ఎన్నిసార్లు ఫోన్ చేసినప్పటికీ ఎటువంటి స్పందన లేదని, మున్సిపల్ కార్యాలయంలో ఏం జరుగుతుందో ఆయనకు తెలియకపోవడం విచారకరమని ఆయన అన్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే బాల్కసుమన్ ఈ విషయంలో శ్రద్ధవహించి మున్సిపల్ కార్యాలయ సిబ్బంది నుండి పేద ప్రజలకు విముక్తి కల్పించాలని ఆయన కోరారు.

Tags:    

Similar News