ఆదిలాబాద్ జిల్లాపై సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక అభిమానం

ఆదిలాబాద్ జిల్లాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక అభిమానం ఉందని, జిల్లా అభివృద్ధికి ఎంతో చొరవ చూపిస్తున్నారని ప్రభుత్వ విప్​ షబ్బీర్ అలీ అన్నారు.

Update: 2024-09-17 13:50 GMT

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక అభిమానం ఉందని, జిల్లా అభివృద్ధికి ఎంతో చొరవ చూపిస్తున్నారని ప్రభుత్వ విప్​ షబ్బీర్ అలీ అన్నారు. మంగళవారం ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌస్ ఆలం, ఇతర జిల్లా అధికారులతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అన్నారు. అర్హులైన ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీని అమలు చేస్తుందని, అంతకు పైగా అప్పు ఉన్నవారు ఆపై డబ్బులను చెల్లిస్తే వారి అప్పు మాఫీ అవుతుందని స్పష్టం చేశారు.

    అదే విధంగా 6 గ్యారంటీలలో ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని, 500 రూపాయలకు సబ్సిడీ గ్యాస్ అందిస్తున్నామని, త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కూడా చేపడతామని తెలిపారు. ఇందులో సొంత స్థలం ఉన్న వారికి రూ.ఐదు లక్షలు అందించనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. 

Tags:    

Similar News