వాంకిడి మండలంలో నాలుగు కుటుంబాల కుల బహిష్కరణ

కుల పెద్దల మాట వినలేదని.. నాలుగు కుటుంబాలను కుల బహిష్కరణ చేసిన సంఘటన మంగళవారం వాంకిడి మండలంలో చోటుచేసుకుంది.

Update: 2024-10-08 10:23 GMT

దిశ, వాంకిడి : కుల పెద్దల మాట వినలేదని.. నాలుగు కుటుంబాలను కుల బహిష్కరణ చేసిన సంఘటన మంగళవారం వాంకిడి మండలంలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబాలు తెలిపిన వివరాల ప్రకారం… సోమవారం రాత్రి పంచాయతీ ఏర్పాటు చేసి వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో తమ కులానికి రూ.5 లక్షలు ఇచ్చిన వ్యక్తికే ఓటు వేయాలని చెప్పారు. అలా కాకుండా మరో వ్యక్తికి మద్దతుగా తిరుగుతున్నారని, అది మానుకొని చెప్పిన వ్యక్తికే మద్దతు తెలపాలని పంచాయతీలో తీర్మానించారు. సదరు బాధిత కుటుంబాలు తమకు నచ్చిన వ్యక్తికే మద్దతు తెలుపుతామని చెప్పారు. దీంతో కుల పెద్దల మాట నిరాకరించినందుకు కుల బహిష్కరణ చేశారని బాధిత కుటుంబాలు ఆరోపించాయి. తమకు న్యాయం చేయాలని కోరుతూ మంగళవారం వాంకిడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.


Similar News