దిశ, ముధోల్: శాంతి భద్రతల పరిరక్షణకే కార్డెన్ సెర్చ్ లు నిర్వహిస్తున్నామని భైంసా పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం భైంసా పట్టణంలోని ఓవైసీ నగర్ కాలనీలో భైంసా ఏఎస్పీ కిరణ్ కారే ఆదేశాల మేరకు సీఐ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో పోలీస్ బలగాలు రెండు గంటల పాటూ నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సంఘ విద్రోహులు నివాసం ఉండడం, సంచారం చేసే అవకాశాలు ఉంటాయని, వారి ఆట కట్టించే క్రమంలోనే తనిఖీలు నిర్వహిస్తామని పోలీసులు వివరించారు. కొత్త వ్యక్తులు, అనుమానితులు ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజలందరూ స్నేహభావంతో, ప్రశాంత వాతావరణంలో ఉండాలని, పోలీసులకు ప్రజలందించే సహకారం వలన సంఘవ్యతిరేక మూకలను మరింత సమర్థవంతంగా అణిచివేయగలమని అన్నారు. ఇట్టి తనిఖీలో సరైన పత్రలు లేని 71 బైక్స్, 10 ఆటోలను సీజ్ చేసినట్లు తెలిపారు. కార్డెన్ సెర్చ్ లో ఎస్ఐలు, సుమారు 80 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.దిశ, ముధోల్: శాంతి భద్రతల పరిరక్షణకే కార్డెన్ సెర్చ్ లు నిర్వహిస్తున్నామని