సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు.

Update: 2024-08-20 12:30 GMT

దిశ, కాగజ్ నగర్ : సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. ఆసిఫాబాద్ పట్టణంలోని ఓడపల్లి గార్డెన్ లో మంగళవారం జిల్లా సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం రోజురోజుకు పెరుగుతున్న ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాల పట్ల విద్యార్థులు, ప్రజలు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. సైబర్ నేరాలపై తల్లిదండ్రులకు, బంధువులకు, స్నేహితులకు విద్యార్థులు వివరించాలన్నారు. మన ప్రమేయం లేకుండా వచ్చే ఓటీపీ షేర్ చేయడం, ఆన్లైన్లో ఉద్యోగాల కోసం వెతకడం,

    ఆన్లైన్ కస్టమర్ కేర్ నంబర్స్ వెతకడం మొబైల్స్ ఫోన్లోకి వచ్చే అనుమానిత లింక్స్ క్లిక్ చేయగానే మన అకౌంట్ లో ఉన్న డబ్బులు ఖాళీ అవుతాయన్నారు. లోన్ యాప్లకు దూరంగా ఉండాలని, కస్టమర్ కేర్ నంబర్లను గూగుల్లో అసలు వెతుకవద్దని, ఆయా సంస్థల అధికారిక వెబ్సైట్ నుంచి మాత్రమే కస్టమర్ కేర్ నెంబర్లను పొందాలని సూచించారు. అపరిచిత నెంబర్ల నుంచి ఫేస్బుక్ వాట్సప్ ద్వారా వచ్చే వీడియో కాల్స్ కు స్పందించవద్దని తెలిపారు. లాటరీ ఆఫర్ లంటూ వచ్చే మెసేజ్లను నమ్మొద్దు వంటి పలు సూచనలు చేశారు. సైబర్ నేరాలకు గురైతే

    వెంటనే 1930 నంబర్​కు డయల్​ చేయాలన్నారు. సైబర్ నేరాలపై ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించి సైబర్ నేరాలపై అవగాహన చేయడం కొరకు పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ప్రభాకర్ రావు, డీఎస్పీ లు సదయ్య, రమేష్, ఇన్స్పెక్టర్లు చిట్టిబాబు, రమేష్, సతీష్, ఎస్ఐలు విజయ్, చంద్ర శేఖర్, ప్రశాంత్, వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News