ఉట్నూర్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాపురెడ్డి

ఉట్నూర్ జూనియర్ మున్సిఫ్ కోర్ట్ నూతన ఎన్నికలు గురువారం స్థానిక కోర్టు అవరణలో నిర్వహించారు.

Update: 2025-03-27 12:17 GMT
ఉట్నూర్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాపురెడ్డి
  • whatsapp icon

దిశ, ఉట్నూర్ : ఉట్నూర్ జూనియర్ మున్సిఫ్ కోర్ట్ నూతన ఎన్నికలు గురువారం స్థానిక కోర్టు అవరణలో నిర్వహించారు. నూతన కమిటీ అధ్యక్షుడు బాపురెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జైవంత్ రావ్, ఉపాధ్యకుడు బానోత్ జగన్, కోశాధికారి శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ చీమ నాయక్, స్పోర్ట్స్ సెక్రటరీ తిరుపతి, కార్యవర్గ సభ్యులుగా వసంత్ రావ్, రామారావుగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలకు అధికారిగా అశోక్ వ్యవహరించారు. అనంతరం నూతన అధ్యక్షుడు బాపు రెడ్డి మాట్లాడుతూ.. న్యాయవాదుల సమస్యల సాధనకు తనవంతుగా కృషి చేస్తున్నారన్నారు.

Similar News