కాంట్రాక్ట్ వైద్యుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం
రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (రిమ్స్) ఆదిలాబాద్ లో కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ లు, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్లు, సీఎంఓ/సీఏఎస్ పోస్టుల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్ తెలిపారు.
దిశ, ఆదిలాబాద్ : రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (రిమ్స్) ఆదిలాబాద్ లో కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ లు, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్లు, సీఎంఓ/సీఏఎస్ పోస్టుల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్ తెలిపారు.
అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు రెండు సెట్ల జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూకు హాజరుకావాలని కోరారు. వివరాలకు జిల్లా వెబ్ సైట్ ను సందర్శించాలని పేర్కొన్నారు. ఈనెల 29న 10:30 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు డైరెక్టర్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు చెప్పారు. మరిన్ని వివరాలకు ఫోన్ నెంబర్లు 08732-358086, 9848057606 కు సంప్రదించాలని కోరారు.