బీజేపీ ఆధ్వర్యంలో సీఎం కేసిఆర్ దిష్టి బొమ్మ దగ్ధం
సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో సీఎం కేసిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
దిశ, మంచిర్యాల: రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి చౌరస్తాలో సీఎం కేసిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ మాట్లాడుతూ.. సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తున్నారంటూ బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదని సాక్షాత్తు పీఎం మోడీ చెప్పినా ఎమ్మెల్యే దివాకర్ రావు, టీబీజీకేఎస్ నాయకులు కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పార్లమెంట్ లో బొగ్గు గనుల వేలానికి మద్దతు తెలిపిన కేసీఆర్ ఇప్పడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ తెలంగాణలోని బొగ్గు గనులను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చిత్తశుద్ధి ఉంటే సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేయబోమని సీఎం కేసీఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్ రావు, శ్రీనివాస్, లక్ష్మణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.