Adilabad Collector : రుణమాఫీ చెల్లింపులో ఆటంకం లేకుండా చర్యలు

రుణమాఫీ చెల్లింపులు రైతులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అధికార

Update: 2024-07-30 13:24 GMT

దిశ,ఆదిలాబాద్ : రుణమాఫీ చెల్లింపులు రైతులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అధికార యంత్రం చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాజార్షి షా అన్నారు. రెండో విడత రుణమాఫీ లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా రైతులకు చెక్కులను పంపిణీ చేశారు. ఇందులో భాగంగా రైతు రుణమాఫీ 2024 -రెండవ విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి లాంఛనంగా మంగళవారం ప్రారంభించిన కార్యక్రమంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ప్రజా ప్రతినిధులు, రెైతులు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రెండవ విడత రుణమాఫీలో భాగంగా రుణ మాఫీ చెక్కులను రైతులకు అందచేయడం జరిగిందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు రుణమాఫీ-2024 మలివిడత నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించడంతో అన్నదాతలు వర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయం ఆవరణ నుండి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ ప్రసాద్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి రుణమాఫీ నిధులను విడుదల చేయగా, ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించి, రైతులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి సందేశాన్ని తిలకించారు.కాగా జిల్లాలోని 17 రైతు వేదికలలోనూ రుణ మాఫీ మలివిడత నిధుల విడుదల కార్యక్రమం కొనసాగ గా, ఎక్కడికక్కడ రైతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒకే పంటకాలం లో రూ. రెండు లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తుండడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వానికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని రెైతులు వారి అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

రైతుల నుద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ ద్వారా రైతుల ఖాతాలలో రూ. 201 కోటి 83 లక్షల 3 వేల 807 రూపాయలు జమ చేయడం జరుగుతుందని అన్నారు. ఇందులో భాగంగా మొదటి విడతగా ఈ నెల 18 న లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేయగా, మలి విడతగా ప్రస్తుతం లక్షా 50 వేల రూపాయల లోపు రుణాలను మాఫీ చేస్తూ నిధులు విడుదల చేసిందన్నారు.రుణమాఫీ ద్వారా అర్హులైన ప్రతి రైతు ప్రయోజనం పొందేలా బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులు రైతులకు తోడ్పాటును అందించాలని , ఏ ఒక్క రైతు అసౌకర్యానికి గురికాకుండా చూడాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి అధికారులదేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన మలివిడత రుణమాఫీ నిధులను రెండు రోజుల్లోపు రైతుల ఖాతాలలో అందుబాటులో ఉండేలా చూడాలని, వారు తమ అవసరాల కోసం ఆ నిధులను వినియోగించుకునే విధంగా చొరవ చూపాలని ,బ్యాంకర్లకు సూచించారు. తొలి, మలి విడతలలో రుణమాఫీ పొందిన రైతులందరికీ జిల్లా యంత్రాంగం తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య, డిసిసిబి చైర్మన్ భోజారెడ్డి, సంబంధిత అధికారులు, బ్యాంకు అధికారులు, రైతు సంఘ అద్యక్షులు, రైతులు,తదితరులు పాల్గోన్నారు.

Tags:    

Similar News