ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో బైంసాలో భారీ పథపంచలన్

నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో హిందూ సమాజాన్ని జాగృతం చేసే ఉద్దేశంతో గత రెండు నెలల క్రితం నిర్వహించవలసిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పథసంచలన్ ర్యాలీ వాయిదాపడుతూ వస్తుంది.

Update: 2023-03-05 10:28 GMT

దిశ, బైంసా : నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో హిందూ సమాజాన్ని జాగృతం చేసే ఉద్దేశంతో గత రెండు నెలల క్రితం నిర్వహించవలసిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పథసంచలన్ ర్యాలీ వాయిదాపడుతూ వస్తుంది. దీంతో ఆర్.ఎస్.ఎస్ సంఘానికి సంబంధించిన పలువురు హైకోర్టుని ఆశ్రయించారు. ఎలాంటి క్రిమినల్ కేసులు లేని 500 మంది స్వయం సంఘాసేవకులతో, పట్టణంలోని ప్రార్థన మందిరాలకు 300 మీటర్ల దూరంలో షరతులతో కూడిన శోభయాత్రకి హైకోర్టు అనుమతినివ్వగా ఆదివారం పథసంచాలన్ యాత్రను(కవాతుర్యాలీ)నిర్వహించారు.

మధ్యాహ్నం ప్రారంభమైన ఈ కవాతును శ్రీ సరస్వతి శిశు మందిర్ సుభద్ర వాటిక ప్రాంగణం నుండి భగత్ సింగ్ చౌక్, కుబీర్ చౌరస్తా, వినాయక నగర్, ఐబీ చౌరస్తా, నిర్మల్ చౌరస్తా, పూలేనగర్ మీదుగా ఆర్.ఎస్.ఎస్.ఘణవేషనను ధరించి స్వయం సేవకులు శోభాయాత్రని సాగించారు. చివరగా సుభద్ర వాటిక శిశుమందిర్ లో ర్యాలీ ముగిసింది.చిన్నపిల్లలు సైతం చాలా ఉత్సాహంగా శోభాయాత్రలో పాల్గొన్నారు. భైంసా పట్టణం సున్నితమైన ప్రాంతం కావడంతో ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఆధ్వర్యంలో దాదాపు 200 మంది పైన పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రధానవీదులలో వున్న సీసీ కెమెరాల ద్వారా పోలీస్ కంట్రోల్ రూమ్ లో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. సుభద్రవాటిక శిశుమందిర్ చేరుకున్న సంఘస్వయం సేవకులతో నగర్ శారీరిక్ ప్రధానోత్సవం (సభ) కార్యక్రమంను నిర్వహించనున్నారు. నగర సంఘ చాలక్ సాధుల కృష్ణదాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గాడే మహేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనుకున్నదానికన్నా భారీసంఖ్యలో సంఘసేవకులు పాల్గొని శోభయాత్రలకు విజయవంతం చేశారు.

Tags:    

Similar News