దుర్గం చిన్నయ్య పై కేసు నమోదు..

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై కేసునమోదు అయింది.

Update: 2023-12-01 04:07 GMT

దిశ, బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై కేసునమోదు అయింది. వివరాల్లోకి వెళితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గురువారం తన సొంత గ్రామమైన నెన్నల మండలం జెండా వెంకటపూర్ గ్రామంలో కండువా వేసుకొని వెళ్లి ఓటు వేసిన విషయం విధితమే. కండుతో వెళ్లి ఓటు వేసీ వివాదానికి తెరలేపిన ఘటన పై జోరుగా చర్చ జరిగింది.

ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన ఎమ్మెల్యే వ్యవహారం ఫిర్యాదు వరకు వెళ్ళింది. పోలింగ్ కేంద్రంలోకి బీఆర్ఎస్ కండువాతో వెళ్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఓటు వేసిన బ్రేకింగ్ న్యూస్ దిశ దినపత్రికలో వచ్చిన విషయం పెద్ద దుమారంలేపింది. కండువాతో వెళ్లి ఓటు వేసినప్పుడు ముందుగా పట్టించుకోని అధికారులు తప్పనిసరిగా స్పందించాల్సి వచ్చింది. ప్రిసైడింగ్ ఆఫీసర్ వోజ్జల రాజశేఖర్ ఫిర్యాదు మేరకు నెన్నల పోలీస్ స్టేషన్లోలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై కేసునమోదు చేశారు.

Tags:    

Similar News