గూడెంలో రూ,1,80,000 దేశదారు పట్టివేత

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలం గూడెం గ్రామంలో రూ.1, 80,000 దేశదారును పట్టుకున్నట్లు కౌటాల సీఐ ముత్యం రమేష్ తెలిపారు

Update: 2024-11-09 09:35 GMT

దిశ, కౌటాల : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలం గూడెం గ్రామంలో రూ.1, 80,000 దేశదారును పట్టుకున్నట్లు కౌటాల సీఐ ముత్యం రమేష్ తెలిపారు. శనివారం కౌటాల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ ప్రభాకర్ కాగజ్నగర్, డీఎస్పీ రామానుజన్ ,ఆదేశాల మేరకు కౌటాల ఎస్సై మధుకర్ శనివారం దేశి దారును, పట్టుకొని, ఆటో స్వాధీనం చేసుకున్నారు. కౌటాల మండలం తమ్ముడి హేటి గ్రామానికి చెందిన ఓడీల ప్రకాష్, చింతల మానేపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన పర్వతాలు ప్రవీణ్, గూడెం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఆగాడి కొండయ్య కలిసి మహారాష్ట్రలో ఎన్నికల సందర్భంగా మద్యపాన నిషేధం అన్న చంద్రపూర్ జిల్లాలో విక్రయించేందుకు 20 దేశదారు కాటన్ లను కొనుగోలు చేసి గడిచి రెల్లిజిల్లాలో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులకు ఇచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు పట్టుకుని సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు. దీని విలువ రూపాయలు ₹ 1,80,000 ఉంటుందని తెలిపారు. ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అక్రమంగా దేశదారు విక్రయాలు చేస్తే సిరిపూర్ నియోజకవర్గంలో కౌటాల , బెజ్జూర్, చింతల మానేపల్లి మండలాల ప్రజలు సమాచారం ఇవ్వాలని కోరారు.


Similar News