పైపులు దొంగిలించిన కేసులో ఇద్దరికి 14 రోజుల రిమాండ్
పైపులు దొంగిలించిన కేసులో ఇద్దరు యువకులకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ శనివారం సీర్పూర్ కోర్టు తీర్పు నిచ్చింది
దిశ, ఆసిఫాబాద్ : పైపులు దొంగిలించిన కేసులో ఇద్దరు యువకులకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ శనివారం సీర్పూర్ కోర్టు తీర్పు నిచ్చింది. కెరమెరి ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం… కెరమెరి మండలంలోని గోయగాం గ్రామానికి చెందిన నాగోషే సత్తయ్య, మొహర్లె జనకిరావు రైతుల పంటపొలాల నుంచి 45 పైపులు దొంగిలించగా, 12.10.2024 లో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టి అదే గ్రామానికి చెందిన గౌత్రే గణపతి, వాంకిడి మండలంలోని లంజన్ వీర గ్రామానికి చెందిన వాడై సుందరం లను అందులో తీసుకుని విచారించగా నేరం రుజువుకావడంతో దొంగిలించిన పైపులు స్వాధీనం చేసుకుని వారిని కోర్టులో హాజరుపర్చగా ఇద్దరికీ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది.