అడేల్లి ఆలయ పుననిర్మాణ పనులు ప్రారంభం
మహా పోచమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులకు సోమవారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దిశ, సారంగాపూర్ : మహా పోచమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులకు సోమవారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అడెల్లి పోచమ్మ అమ్మవారి గర్భాలయ పుననిర్మాణానికి భూమి పూజ చేశారు. మంత్రి అల్లోల మాట్లాడుతూ యాదాద్రి, బాసరలా అడెల్లి అమ్మవారిని అభివృద్ధి చేస్తామన్నారు. పరిసరాల్లో ఇప్పటికే పనులు చేపట్టగా, రూ.10 కోట్లతో ప్రస్తుతం ఉన్న గర్భాలయాన్ని కృష్ణశిలలతో అత్యద్భుతంగా నిర్మిస్తామన్నారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ఈ ప్రాంతంలో అధ్యాద్మిక వాతావరణం మరింతగా విస్తరించాలన్న ఉద్దేశంతో మహాపోచమ్మ ఆలయ రూపురేఖలను పూర్తిగా మార్చేందుకు నిర్ణయించారు. దీని కోసం రూ. 6 కోట్ల 60 లక్షలను మంజూరు చేశారు. ఈ నిధులతో ఆలయాన్ని మరింత విస్తరించనున్నారు. భక్తులకు అవసరమైన సదుపాయాలను కల్పించడంతో పాటు అన్ని హంగులతో ఆలయాన్ని పునర్నిర్మించనున్నారు.
ఇందుకు సంబంధించిన పనులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. యాదాద్రి తరహాలోనే పూర్తిగా కృష్ణ శిలలతో నిర్మించేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించారు. గర్భాలయంలోని అమ్మవారి విగ్రహం మినహా దేవాలయాన్ని పూర్తిగా ఆధునీకరించనున్నారు. దాదాపు రూ. 6. 60 కోట్లతో గర్భగుడి అర్ధమండపం పనులను చేపట్టనున్నారు. మరో రూ.కోటితో రాజగోపురం, రూ. 60 లక్షలతో ఆలయంలో పలు పనులు చేపట్టనున్నారు.
ఆలయ కమిటీ చైర్మన్ ఐటీ చందు, ఎంపీపీ మహిపాల్ రెడ్డి, మండల ఇన్ ఛార్జి మురళీధర్ రెడ్డి, సొసైటీ చైర్మన్ నారాయణ రెడ్డి, మాణిక్ రెడ్డి సొసైటీ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ, మాజీ మార్కెట్ చైర్మన్ రాజ్ మహమ్మద్, సర్పంచులు, ఎంపీటీసీలు, బిఆర్ఎస్ కార్యకర్తలు, ఆలయ సిబ్బంది, గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు