ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పనుల్ని సహించం : మంత్రి గంగుల కమలాకర్
ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఎలాంటి అంశాన్ని ఉపేక్షించబోమని, ప్రభుత్వం దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి గంగుల కమలాకర్ హెచ్చరించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఎలాంటి అంశాన్ని ఉపేక్షించబోమని, ప్రభుత్వం దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి గంగుల కమలాకర్ హెచ్చరించారు. ప్రభుత్వం, ఉద్యోగులు కలిసి రాష్ట్ర ప్రజలకు రైతులకు, పేదలకు నాణ్యమైన సేవల్ని అందించాలని పిలుపునిచ్చారు. పౌరసరఫరాల సంస్థ రైతులకు, పేదలకు సేవలు చేస్తున్నదన్నారు. హైదరాబాద్ లోని సివిల్ సప్లై కార్పొరేషన్ భవన్ లో సోమవారం 33జిల్లాల డీఎంలు, ఉద్యోగులతో సమావేశమయ్యారు.
అనంతరం ఉద్యోగుల డైరీని ఆవిష్కరించి, హెల్త్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎంఆర్ డెలివరీ త్వరగా పూర్తి చేయడంతో పాటు రాబోయే కొత్త పంట వచ్చే సమయానికి రైస్ మిల్లులు, గోదాములను ఖాళీ చేయాలని ఆదేశించారు. డిఫార్మెంట్లోని ప్రతి ఉద్యోగి నిరంతరం అప్రమత్తంగా ఉండి రైతులకు సేవలందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, ఉద్యోగుల సంఘం నేతలు, ఉద్యోగులు పాల్గొన్నారు.