ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటుతుండగా ప్రమాదం!.. గాల్లో ఎగిరిపడి యువకుడు

సెల్ ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

Update: 2024-07-15 08:11 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సెల్ ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.ఈ ఘటన సోమవారం హైదరాబాద్ లోని అన్నోజిగూడ ప్రాంతంలో జరిగింది. ఘటన ప్రకారం.. హైదరాబాద్- వరంగల్ హైవే మార్గం ఎల్లప్పుడూ రద్దీగా ఉంటుంది. ఈ రోడ్డు పై ఓ వ్యక్తి సెల్ ఫోన్ మాట్లాడుతూ.. రోడ్డు దాటే ప్రయత్నం చేశాడు. కొన్ని ద్విచక్రవాహానాలను తప్పించుకొని వెళుతూ.. సెల్ ఫోన్ మాయలో పడి, ఎదురుగా వస్తున్న కారును గమణించలేదు. అకస్మాత్తుగా వ్యక్తి నడిరోడ్డుపై కనిపించడంతో.. కారు డ్రైవర్ బ్రేక్ వేసే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది. కారు వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో ఆ వ్యక్తి గాల్లో ఎగిరి ఫల్టీలు కొడుతూ కింద పడ్డాడు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వెళ్లి చూడగా ఆ వ్యక్తి అక్కడిక్కడే మరణించాడు. ఈ ఘటన హైవేపై ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందిస్తూ.. సెల్ ఫోన్ మాట్లాడుతూ ఇలా రోడ్డు దాటడం ప్రమాదకరం! అని, మీ భద్రత మీ చేతుల్లోనే ఉంటుందని తెలిపారు. జాగ్రత్తగా ఉండి, బాధ్యతగా నడుచుకోండని చెబుతూ.. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రమాదాలకు గురికావద్దని సూచించారు.

Tags:    

Similar News