దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ లింగంపల్లిలో నిలిపివేత.. ప్రయాణికుల ఆందోళన.. ఏమైందంటే?

సికింద్రాబాద్-ముంబై మధ్య నడిచే దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఏసీ పనిచేయడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ట్రైన్‌ను ఆపి ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Update: 2024-04-06 11:17 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సికింద్రాబాద్-ముంబై మధ్య నడిచే దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఏసీ పనిచేయడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ట్రైన్‌ను ఆపించి ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరిన దేవగిరి ఎక్స్‌ప్రెస్ (17058) ట్రైన్‌లో, ఏసీ కంపార్ట్మెంట్స్‌లో ఏసీ పనిచేయట్లేదని మిరజాపల్లి దగ్గర ట్రైన్‌ను ఆపి ప్రయాణికులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలోనే లోకో పైలట్‌తో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు.

మాములు కంపార్ట్‌మెంట్లలో ఫ్యాన్ చెడిపోతే కిటికి ఓడెన్ చేస్తే సరిపోతుంది.. కానీ ఏసీ బోగీల్లో కిటికీలు ఉండవు కాబట్టి అస్వస్థతకు గరువుతారని ప్రయాణికులు ఆగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలోనే ప్రయాణికులు రైల్వే శాఖకు లేఖ రాశారు. దీనికి సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా రైల్వే మంత్రికి, రైల్వే శాఖకు ట్యాగ్ చేశారు. కాగా ప్రయాణికుల ఆందోళన అనంతరం ట్రైన్ గంట ఆలస్యంగా బయలుదేరినట్లు సమాచారం.

Tags:    

Similar News