Aadi Srinivas: కేటీఆర్‌కు జైలుకెళ్లే భయం పట్టుకుంది.. విప్ ఆది శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) కు జైలుకెళ్లే భయం పట్టుకుందని ప్రభుత్వం చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) కు జైలుకెళ్లే భయం పట్టుకుందని ప్రభుత్వం చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన హైదరాబాద్ (Hyderabad)లో మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారాన్ని అనుభవించి.. చేసిన అక్రమాలు, స్కాంలు నేడు ఎక్కడ బయటపడతాయనే వణుకు ఆయన మొదలైందని కామెంట్ చేశారు. అందుకే భయంతో ఈ మధ్య నోటికొచ్చినట్లుగా ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
ప్రస్తుతం ఆయనపై విచ్చిన అభియోగాల నేపథ్యంలో కేటీఆర్ (KTR) కనీసం రెండు, మూడేళ్లయిన జైలులో ఉండటం ఖాయమని స్పష్టం చేశారు. ఓ నాలుగు రోజులు ఆగితే.. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అంటే ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) అవినీతి, ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) అంశాలపై జరుగుతోన్న విచారణలో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చేస్తున్నాయని అందుకే కేటీఆర్ (KTR) మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ.. తానేమి తప్పు చేయలేదనే విధంగా మాట్లాడుతున్నారని విప్ ఆది శ్రీనివాస్ ధ్వజమెత్తారు.