Aadi Srinivas: చెన్నమనేని పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు.. విప్ ఆది శ్రీనివాస్ రియాక్షన్ ఇదే!
వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు తెలంగాణ హైకోర్టులో ఊహించని షాక్ తగిలింది.

దిశ, వెబ్‌డెస్క్: వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ (Chennamaneni Ramesh)కు తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో ఊహించని షాక్ తగిలింది. పౌరసత్వం (Citizenship) కేసులో దాఖలు చేసిన పిటిషన్‌పై పదేళ్ల పాటు సుదీర్ఘంగా విచారణ చేపట్టిన ధర్మాసనం ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ తుది తీర్పును ఇవాళ వెలువరించింది. కేంద్రం ఇచ్చిన రిపోర్టు మేరకు ఆయన జర్మనీ (Germany) పౌరుడేనని పేర్కొంది. ఈ క్రమంలో విచారణ సందర్భంగా కోర్టును తప్పుదోవ పట్టించిన రమేష్‌పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫేక్ డ్యాక్యుమెంట్లు (Fake Documents) సమర్పించినందుకు గాను రూ.30 లక్షల జరిమానా విధించింది. అదేవిధంగా కేసులో ప్రతివాది క్లయింట్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ (MLA Aadi Srinivas)కు రూ.25 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. రూ.5 లక్షలు లీగల్ సర్వీస్ అథారిటీ (Legal Services Authority)కి చెల్లించాలని తెలిపింది. చెల్లింపులన్నీ నెల రోజుల్లోనే పూర్తి చేయాలని ధర్మాసనం తీర్పును వెలువరించింది.
అయితే, తాజాగా చెన్నమనేని రమేష్ (Chennamneni Ramesh) పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కొట్టివేయడంపై ప్రభత్వ విప్, ప్రస్తుత వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ (MLA Aadi Srinivas) స్పందించారు. చెన్నమనేని రమేష్ కోర్టును కూడా తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. జర్మనీ పాస్‌పోర్టు (Germany Passport)పై దాదాపు 45 సార్లు ప్రయాణం చేసినట్లుగా కోర్టుకు ఆధారాలు సమర్పించానని తెలిపారు. జర్మనీ పౌరసత్వం (Germany Citizenship) కలిగి ఉండి రమేశ్ ఎమ్మెల్యే అయ్యారని, తప్పుడు పత్రాలు సమర్పించి ఎమ్మెల్యేగా గెలుపొందారని ఫైర్ అయ్యారు. 15 ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేసి గెలిచానని ఆది శ్రీనివాస్ అన్నారు.