KCR హయాంలో కళకళలాడిన వ్యవసాయ రంగం.. నేడు రాబందుల రాజ్యంలో విలవిలలాడుతోంది: మహిళా రైతు ఆవేదన
రైతుబంధు సమయానికి పడటం లేదు.. అప్పు చేసి పంటలు వేస్తున్నామని ఓ మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: రైతుబంధు సమయానికి పడటం లేదు.. అప్పు చేసి పంటలు వేస్తున్నామని ఓ మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేసింది. మాకు పత్తి, వడ్లు ధర పెంచాలని, రైతుబంధు కూడా సమయానికి పడటం లేదు, మూడు రూపాయిల వడ్డీకి అప్పు తీసుకు వచ్చి పంటలు వేస్తున్నామని చెప్పుకొచ్చింది. కాలవలో నీళ్లు వదలాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పండి అంటూ మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేసింది. ఏం అన్న అంటే కొత్తగా వచ్చినం.. పెళ్లి చేయగానే పిల్లలు పుడుతారా, అయిదేళ్లు చూడాలి అంటున్నారని తెలిపింది. రైతుబంధు కేసీఆర్ హయాంలో కళకళలాడిన వ్యవసాయ రంగం, నేడు రాబందుల రాజ్యంలో విలవిలలాడుతోందని మండిపడింది. రైతుబంధు పథకాన్ని బంద్ పెట్టి కరెంటు సరిగ్గా ఇవ్వలేక, సమయానికి విత్తనాలు, ఎరువులు సరఫరా చేయలేక సాగునీరు అందించలేక పండిన పంటను పూర్తిగా కొనలేక రైతుల ఉసురుపోసుకుంటుంది ఈ అరాచక కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ మండిపడింది. రైతుబంధు లేక, రుణమాఫీ లేక, వాన లేక, బోరులో నీళ్లు లేక.. కాలవలో చుక్క నీళ్లు కూడా రాక రైతులు తిప్పలు పడుతున్నారని వెల్లడించింది. కేసీఆర్ ఉన్నప్పుడు నెలా నెలా పెన్షన్ వచ్చేదని, ఇప్పుడు రెండు నెలల నుంచి పెన్షన్ లేదని, నెలకు నాకు మూడువేలు మందులకు కావాలని పెన్షన్ లేక రెండు నెలలుగా మందులు కూడా లేవని ఓ వృద్ధురాలు తన బాద వెల్లగక్కింది.