ఏపీ డిప్యూటీ CM పవన్ కల్యాణ్‌కు ఘన స్వాగతం

శామీర్‌పేట్ మండలంలోని తుర్కపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జనసేన కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు.

Update: 2024-06-29 05:53 GMT

దిశ, మేడ్చల్ టౌన్: శామీర్‌పేట్ మండలంలోని తుర్కపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జనసేన కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు. శనివారం జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి వెళ్లే దారి లోతుర్కపల్లి గ్రామం వద్ద అభిమానులకు కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ అభివాదం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ, జనసేన పార్టీ కలిసి పని చేస్తాయని అన్నారు. తెలంగాణలో జనసేన కార్యకర్తలకు అభిమానులకు ఉద్యమకారులకు ధన్యవాదాలు తెలియజేశారు.

 

Tags:    

Similar News