Breaking: బస్సు కింద పడి విద్యార్థిని మృతి

హైదరాబాదులో హృదయవిధారక ఘటన చోటుచేసుకుంది.

Update: 2024-06-14 10:37 GMT

దిశ వెబ్ డెస్క్: హైదరాబాదులో హృదయవిధారక ఘటన చోటుచేసుకుంది. బస్సు కింద పడి ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడాలో కాసేపటి కిందట వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. ఆర్టీసీ బస్సు ఎక్కుతూ కాలుజారి ఓ విద్యార్థిని బస్సు చక్రాల కింద పడి మృతి చెందింది. ఈ నేపథ్యంలో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కాగా మృతి చెందిన విద్యార్థినిని యూసఫ్‌గూడాలోని మాస్టర్స్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న మెహరీన్‌గా గుర్తించారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ధర్యాప్తు చేపట్టారు.


Similar News