సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన బియ్యం ధరలు
దేశంలో బియ్యం ధరలు భారీగా పెరిగాయి. HMT, BPT, సోనామసూరి ధరలు క్వింటాల్‌పై రూ.1000 నుంచి రూ.1500 వరకు పెరిగాయి.
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో బియ్యం ధరలు భారీగా పెరిగాయి. HMT, BPT, సోనామసూరి ధరలు క్వింటాల్‌పై రూ.1000 నుంచి రూ.1500 వరకు పెరిగాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో సంభవించిన వరదలతో పంటనష్టం, వరిసాగు తగ్గడమే బియ్యం రేట్లు పెంపునకు కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం క్వింటాల్ బియ్యం రూ.4500 నుంచి రూ.5000 ఉండగా.. తాజాగా.. రూ.6200 లకు పెరిగింది. పాత బియ్యం అయితే రూ.7500 వరకూ పలుకుతోంది. మొత్తంగా సగటున క్వింటాల్‌పై రూ.1000 వరకు పెరిగింది. కాగా, నిన్నమొన్నటి వరకు వంటనూనెలు, కూరగాయల ధరలు సామాన్యులను భయపెడితే ఇప్పుడా జాబితాలోకి బియ్యం వచ్చి చేరాయి. గతంలో ఎన్నడూ లేనంతగా బియ్యం ధరలు పెరుగుతుండడం కలవరపెడుతున్నది.