BIG అలర్ట్: కేబుల్ బ్రిడ్జిపై పుట్టినరోజు జరుపుకోవాలనుకుంటున్నారా?
హైదరాబాద్ మహానగరంలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి తప్పకుండా ఉంటుంది. రోజూ ఈ బ్రిడ్జిని చూసేందుకు వందల మంది వస్తుంటారు.
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగరంలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి తప్పకుండా ఉంటుంది. రోజూ ఈ బ్రిడ్జిని చూసేందుకు వందల మంది వస్తుంటారు. నగర వాసులే కాకుండా జిల్లాల నుంచి తరలివస్తుంటారు. ఈ క్రమంలోనే ఇక్కడ రాత్రుళ్లు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సర్వసాధారణంగా మారింది. ఈ క్రమంలో రోడ్డుపై రద్దీ పెరిగి ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. దీంతో నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేబుల్ బ్రిడ్జీపై సెల్ఫీలు దిగితే ఫైన్‌తో పాటు కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ఎవరైనా ఫొటోల కోసం కేబుల్ బ్రిడ్జిపైకి వస్తే రూ.1000 జరిమానాతో పాటు కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. కేబుల్ బ్రిడ్జిపై తరచూ జరుగుతున్న ప్రమాదాలు నివారణకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.