Bandi sanjay: తెలంగాణకు కొత్త రైలు మార్గం మోడీ సంకల్పానికి సాక్ష్యం: బండి సంజయ్

రాష్ట్రం మీదుగా కొత్త రైల్వే లైన్ విషయంలో కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై బండి సంజయ్ స్పందించారు.

Update: 2024-08-10 05:47 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ మీదుగా కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఈ నిర్ణయం రైల్వే నెట్ వర్క్ ను పటిష్టం చేసే విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పానికి సాక్ష్యం అన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఎనిమిది కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులకు నిన్న ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన సెంట్రల్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంపై శనివారం బండి సంజయ్ ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు. రూ. 24,657 కోట్ల అంచనా వ్యయంతో ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, జార్ఖండ్, బిహార్, పశ్చిమబెంగాల్ లో ఈ కొత్త రైలు మార్గాలు ఏర్పాటు చేయనున్నారని అందులో భాగంగా ఒడిశా లోని మల్కాన్ గిరి నుంచి భద్రాచలం మీదిగా పాండురంగాపురం వరకు రూ. 4,109 కోట్లతో 200.60 కిలోమీట్ల పొడువైన కొత్త లైన్ నిర్మించబోతున్నారని పేర్కొన్నారు. ఈ లైన్ పూర్తయి అందుబాటులోకి వస్తే ఏపీ, తెలంగాణ నుంచి తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు రైల్వే అనుసంధానం పెరగనున్నదని స్పష్టం చేశారు. 

Tags:    

Similar News