Ramoji Rao: రామోజీరావుకు నివాళిగా సినీ ఇండస్ట్రీ కీలక నిర్ణయం
ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు మరణం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం నింపింది. 1980వ దశకం ప్రారంభంలో సినీ రంగంలోకి ఎంటర్ అయిన రామోజీరావు శ్రీవారికి ‘ప్రేమలేఖ’ చిత్రాన్ని 1984లో నిర్మించారు.
దిశ, వెబ్‌డెస్క్: ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు మరణం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం నింపింది. 1980వ దశకం ప్రారంభంలో సినీ రంగంలోకి ఎంటర్ అయిన రామోజీరావు శ్రీవారికి ‘ప్రేమలేఖ’ చిత్రాన్ని 1984లో నిర్మించారు. దాదాపు 60 సినిమాలకు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్న ఆయన.. ‘నువ్వేకావాలి’ చిత్రానికి (2000లో విడుదలైంది) జాతీయ అవార్డు లభించింది. 1985లో విడుదలైన ‘ప్రతిఘటన’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించింది. విజయశాంతి నటించిన ఈ చిత్రానికి ఫిల్మ్‌ఫేర్ నుంచి బెస్ట్ ఫిలిం అవార్డు లభించింది. దానికి కొనసాగింపుగా ‘మయూరి’, ‘కాంచనగంగ’, ‘నువ్వే కావాలి’, ‘మౌనపోరాటం’, ‘అశ్విని’, ‘తేజ’ తదితర చిత్రాలకు నంది అవార్డులు కూడా వచ్చాయి. దీంతో రామోజీరావు మృతి ఇండస్ట్రీని కుదిపేసింది. ఈ క్రమంలో ఆయనకు నివాళిగా తెలుగు చిత్ర పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది. రామోజీరావుకు సంతాప సూచికగా రేపు సినిమా షూటింగ్‌లకు బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని శనివారం సాయంత్రం ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ వెల్లడించారు. కాగా, అనారోగ్యం కారణంగా ఇవాళ తెల్లవారుజామున రామోజీరావు (88) కన్నుమూశారు.