HYD: ఆస్పత్రి సిబ్బంది అప్రమత్తత.. తప్పిన భారీ ప్రమాదం
నగరంలో నిత్యం చోటు చేసుకుంటున్న అగ్ని ప్రమాదాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
దిశ, బహదూర్ పురా: నగరంలో నిత్యం చోటు చేసుకుంటున్న అగ్ని ప్రమాదాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా బహదూర్ పురా కిషన్ బాగ్‌లోని జ్ఞానేశ్వర్ ఆసుపత్రిపైన అర్ధరాత్రి సెల్ టవర్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే ఆస్పత్రి సిబ్బంది ఫైర్ స్టేషన్కు, బహదూర్ పురా పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు. ఆస్పత్రి సిబ్బంది అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.