Musi Padayatra: సీఎం రేవంత్ రెడ్డి ఎదుట రైతులు, మత్య్సకారుల గగ్గోలు

సీఎం రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవన సంకల్ప పాదయాత్ర ముగిసింది..

Update: 2024-11-08 11:22 GMT

దిశ, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy) మూసీ పునరుజ్జీవన సంకల్ప పాదయాత్ర(Musi Purujjeevana Sankalpa Padayatra) ముగిసింది. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం సంగెం నుంచి నాగిరెడ్డిపల్లి వరకూ మూసీ నది వెంట ఆయన పాదయాత్ర చేశారు. నది పొడవునా కాలుష్యాన్ని పరిశీలించారు. మధ్యలో మత్య్సకారులు, రైతుల సమస్యలను ఆయన విన్నారు. మూసీ నది నీళ్లు స్థానిక చెరువుల్లో కలవడం వల్ల చేపలు చనిపోతున్నాయని, తద్వారా తాము నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అటు ప్రజలకు కూడా అనారోగ్య సమస్యలు తలెత్తున్నాయని, చాలా మందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని, రోగాలతో ఇప్పటికే పలువురు చనిపోయారని, మూసీ నది ప్రక్షాళన మంచి కార్యక్రమం అని చెప్పారు. మత్య్సకారుల సమస్యలను సానుకూలంగా విన్న రేవంత్ రెడ్డి వారికి కీలక హామీ ఇవ్వడంతో హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ముగియడంతో నాగిరెడ్డిపల్లి సభకు హాజరయ్యారు. రేవంత్ పాదయాత్రలో నల్గొండ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 


Similar News