ఇది ట్రైలరే.. జనవరిలో సినిమా: కేటీఆర్‌కు దిమ్మ తిరిగే సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి

జనవరిలో వాడపల్లి నుంచి పాదయాత్ర చేస్తానని, దమ్ముంటే అడ్డుకోవాలంటూ మాజీ మంత్రి కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు...

Update: 2024-11-08 13:16 GMT

దిశ, వెబ్ డెస్క్: మూసీ నది(Musi River) ప్రక్షాళనపై మాజీ సీఎం కేసీఆర్(Former CM KCR), మాజీ మంత్రులు కేటీఆర్(Former Minister KTR), హరీశ్‌రావు(Former Minister Harish Rao)కు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సవాల్ విసిరారు.  యాదాద్రి జిల్లా వలిగొండ మండలం సంగెం నుంచి నాగిరెడ్డిపల్లి వరకూ మూసీ పునరుజ్జీవనం సంకల్ప పాదయాత్ర నిర్వహించారు. మాజీ మంత్రి కేటీఆర్ పాదయాత్ర చేపడతానన్న వ్యాఖ్యలకు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి స్పందించారు. మూసీ నది అభివృద్ధిపై 30 రోజుల్లో డిజైన్లు రెడీ చేస్తామని స్పష్టం చేశారు. జనవరి మొదటి వారంలో వాడపల్లి నుంచి పాదయాత్ర చేస్తానని ఛాలెంజ్ చేశారు. 2025 జనవరిలో చార్మినార్ దగ్గర సభ పెట్టి కదం తొక్కుతామన్నారు. ఇది ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ఇంకా ఉందని హెచ్చరించారు. మూడు నదులను అనుసంధానం చేసి నల్గొండ జిల్లా రైతులకు సురక్షితమై నీళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుకు దమ్ముంటే తన పాదయాత్రను ఆపేందుకు ప్రయత్నం చేయాలని సవాల్ విసిరారు. ఎవరైనా అడ్డుకుంటే తొక్కు కుంటూ వెళ్తామని రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. 

Tags:    

Similar News

టైగర్స్ @ 42..