నాగార్జున సాగర్ వివాదంలో కీలక పరిణామం.. ఏపీ పోలీసులపై తెలంగాణలో కేసు నమోదు

ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న నాగార్జున సాగర్ డ్యామ్ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ భూభాగంలోకి దౌర్జన్యంగా వచ్చారని ఏపీ పోలీసులపై

Update: 2023-12-01 06:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న నాగార్జున సాగర్ డ్యామ్ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ భూభాగంలోకి దౌర్జన్యంగా వచ్చారని ఏపీ పోలీసులపై తెలంగాణలో కేసు నమోదు అయ్యింది. డ్యామ్‌పై కాపలాగా ఉన్న ఎస్పీఎఫ్ పోలీసులు, తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ పోలీసులపై విజయపురి స్టేషన్ పోలీసులు సెక్షన్ 447, 427 కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఏ1గా ఏపీ పోలీసులను చేర్చారు. 500 మంది సాయుధ బలగాలతో డ్యామ్ పైకి బలవంతంగా వచ్చారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. డ్యామ్ 13 గేట్లు ధ్వంసం చేశారని.. కృష్ణా బోర్డు నిబంధనలకు విరుద్ధంగా ఏపీకి నీటిని విడుదల చేశారని ఈ కంప్లంట్‌లో పేర్కొన్నారు. మరోవైపు డ్యామ్ వద్ద ఇరు రాష్ట్రాల పోలీసులు భారీగా మోహరించారు. దీంతో సాగర్ డ్యామ్ వద్ద తీవ్ర ఉద్రిక్త నెలకొంది. కృష్ణా నీటి పంపకాల్లో ఏపీ, తెలంగాణ మధ్య మరోసారి వివాదం తలెత్తడంతో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సభ్యులు డ్యామ్ వద్దకు చేరుకున్నారు.

Tags:    

Similar News