పత్తి రైతులతో మాట్లాడిన బండి

ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర 3 వ రోజులో భాగంగా గుండెగాం గ్రామ సమీపంలోని పత్తి చేనులో కూలిలతో బండి సంజయ్ మాట్లాడారు.

Update: 2022-11-30 07:00 GMT

దిశ, ముధోల్ : ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర 3 వ రోజులో భాగంగా గుండెగాం గ్రామ సమీపంలోని పత్తి చేనులో కూలిలతో బండి సంజయ్ మాట్లాడారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు పలు సమస్యలను సంజయ్ దృష్టికి తీసుకువచ్చారు. ఉండటానికి ఇళ్లు లేదన్నారు. పింఛన్లు రావడం లేదన్నారు. ప్రభుత్వం బీడీ కార్మికులకు రూ. 2000 పెన్షన్ ఇస్తోంది. కనీసం మాలాంటి నిరుపేద కూలీలకు రూ.1000 అయినా పెన్షన్ ఇవ్వాలన్నారు. బండి సంజయ్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఉపాధి కల్పిస్తోందన్నారు. ఉపాధి హామీ పథకం నిధులను కూడా కేసీఆర్ దారిమళ్లిస్తున్నాడని ఆరోపించారు. తెలంగాణలో పెద్దల రాజ్యం పోవాలి. పేదల రాజ్యం రావాలని పిలుపు నిచ్చారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక అండగా ఉంటామన్నారు. 


Similar News