తెలంగాణలో హృదయవిదారక ఘటన.. కన్నీళ్లు పెట్టిస్తోన్న వృద్ధుడి ఆత్మహత్య

సిద్దిపేట జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. తన చితిని తానే పేర్చుకొని 90 ఏళ్ల వృద్ధుడు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

Update: 2023-05-05 03:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. తన చితి తానే పేర్చుకుని 90 ఏళ్ల వృద్ధుడి ఆత్మాహత్య చేసుకోవడం సిద్దిపేట జిల్లాలో కలకలం రేపుతోంది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం పొట్లపల్లిలో గ్రామంలో జరిగింది. వివరాల్లో వెళితే.. పొట్లపల్లి గ్రామానికి చెందిన మెడబోయిన వెంకటయ్య (90)కు నలుగురు కుమారులు. ఓ కుమార్తె ఉన్నారు. వెంకటయ్య భార్య గతంలోనే చనిపోయింది. కుమారుల్లో ఇద్దరు పొట్లపల్లిలోనే కాపురం ఉండగా, ఒకరు హుస్నాబాద్‌లో, మరొకరు కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేటలో నివసిస్తున్నారు. కుమారులు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు.

వెంకటయ్య తనకున్న నాలుగెకరాల భూమి కుమారులకు పంచేశారు. 5 నెలల క్రితం వెంకటయ్య పోషణ నిమిత్తం పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ జరిగింది. నెలకు ఒకరు చొప్పున నలుగురు కుమారులు వంతులవారీగా తండ్రిని పోషించాలని నిర్ణయించారు. గ్రామంలో ఉంటున్న పెద్ద కుమారుడు వంతు పూర్తి కావడంతో నవాబుపేటలోని రెండో కుమారుడి వద్దకు వెళ్లాల్సి ఉంది. దీంతో సొంత ఊరిని, ఇంటిని వదిలి వెళ్లడం ఇష్టంలేని వెంకటయ్య చితి పేర్చుకుని మంటరాజేసి దానిలో దూకి ఆత్మాహుతికి పాల్పడినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు.

Tags:    

Similar News