Damodara Raja Narasimha: 50 ఏళ్ల కల నెరవేరింది.. అసెంబ్లీలో మంత్రి దామోదర ఎమోషన్

ఎస్సీ వర్గీకరణపై చర్చ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహా ఎమోషన్ అయ్యారు.

Update: 2024-08-01 07:23 GMT
Damodara Raja Narasimha: 50 ఏళ్ల కల నెరవేరింది.. అసెంబ్లీలో మంత్రి దామోదర ఎమోషన్
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎన్నో ఏళ్ల పోరాటం ఫలించిందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై చర్చ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. ఎస్సీ వర్గీకరణ 50 ఏళ్ల కల అని, ఎంతో భావోద్వేగంతో కూడుకున్న అంశం అన్నారు. దీని కోసం ప్రాణ బలిదానాలు జరిగాయని గుర్తు చేశారు. వర్గీకరణ అనేది ఒక వర్గానికి వ్యతిరేకం కాదని, సమ న్యాయం.. సమ ధర్మం అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు చారిత్మాత్మక మైనదని, వర్గీకరణ పోరాటాన్ని 50 ఏళ్లుగా చూస్తున్నాను. వర్గీకరణ విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పుతో ఏమోషన్ అవుతున్నానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏజీతో సీఎం మాట్లాడారు. సుప్రీంకోర్టులో లాయర్ ను నియమించి రాష్ట్ర ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించేలా నా నేతృత్వంలో ఓ డెలిగేషన్ టీమ్ ను సీఎం ఢిల్లీకి పంపించారు. సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్ ద్వారా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాం. సానుకూలమైన తీర్పు వచ్చింది. తీర్పుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తగిన విధమైన చర్యలు తీసుకుంటుందన్నారు. వర్గీకరణ విషయంలో సహకరించిన సీఎంకు, మాదిగ ఉప కులాల తరపున, నా తరపున ధన్యవాదాలు చెబుతున్నానన్నారు.

Tags:    

Similar News