TS: ముగిసిన కానిస్టేబుల్ ఫైనల్ ఎగ్జామ్.. ఎంత శాతం హాజరయ్యారంటే?

రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌ కానిస్టేబుల్‌ (సివిల్, వివిధ విభాగాలు), ఐటీ అండ్ కమ్యూనికేషన్ ఉద్యోగాల‌కు సంబంధించిన తుది రాత పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని టీఎస్ఎల్పీఆర్బీ బోర్డు తెలిపింది.

Update: 2023-04-30 13:53 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌ కానిస్టేబుల్‌ (సివిల్, వివిధ విభాగాలు), ఐటీ అండ్ కమ్యూనికేషన్ ఉద్యోగాల‌కు సంబంధించిన తుది రాత పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని టీఎస్ఎల్పీఆర్బీ బోర్డు తెలిపింది. ఆదివారం నిర్వహించిన ఈ పరీక్షలకు మొత్తం కలిపి 98.1 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్‌ సహా తొమ్మిది జిల్లాలోని 183 కేంద్రాల్లో సివిల్‌ కానిస్టేబుల్‌ పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది. ఈ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించారు. ఈ పరీక్షకు 1,09,663 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. పరీక్షలకు 1,08,055 మంది అటెండ్‌కాగా 98.53శాతం హాజరునమోదైందని బోర్డు పేర్కొంది.

పోలీస్‌ కానిస్టేబుల్‌ (ఐటీ అండ్ కమ్యూనికేషన్) పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించారు. హైదరాబాద్‌ సహా ఎనిమిది కేంద్రాల్లో పరీక్ష కొనసాగింది. 6,801 మంది అభ్యర్థులకు గాను.. 6,088 మంది పరీక్ష రాశారని, 89.52శాతం హాజరు నమోదైనట్లు బోర్డు వివరించింది. ప్రణాళికాబద్ధంగా ఈ పరీక్షలను విజయవంతంగా నిర్వహించామని, పరీక్ష సమయంలో అభ్యర్థుల వేలిముద్రలు, ఫోటోలు సేకరించినట్లు తెలిపింది. త్వరలోనే పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ కీని అన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు రిక్రూట్‌మెంట్ బోర్డు స్పష్టం చేసింది.

Tags:    

Similar News