దిండి నదిలో చిక్కుకున్న 9 మంది మత్స్యకారులు

నాగర్ కర్నూల్ జిల్లాలోని దిండి నదిలో 9 మంది మత్స్యకారులు చిక్కుకున్నట్టు పోలీసులు తెలిపారు.

Update: 2024-09-02 17:23 GMT

దిశ, వెబ్ డెస్క్ : నాగర్ కర్నూల్ జిల్లాలోని దిండి నదిలో 9 మంది మత్స్యకారులు చిక్కుకున్నట్టు పోలీసులు తెలిపారు. కృష్ణా నదికి ఉపనది అయిన దిండి నదిలో వీరంతా ఉదయం చేపలు పట్టడానికి వెళ్లారు. అయితే ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు, నదీ వరాదను అంచనా వేయలేక వారంతా నదిలోనే పెద్ద బండరాయి మీదికి చేరుకొని, తమని కాపాడమని ఆర్తనాదాలు చేశారు. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం వారికి ఆహార పోట్లాలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామన్న అచ్చంపల్లి పోలీసులు.. వారిని రక్షించడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహాయం కోరాయి. కాగా బాధితులంతా దిండి మండలం గోనబోయినపల్లికి చెందిన వారీగా పోలీసులు గుర్తించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.   


Similar News