ఇరిగేషన్‌లో 879 కొత్త పోస్టులు.. 8 ఏండ్ల తర్వాత భర్తీకి మోక్షం

రాష్ట్ర నీటిపారుదల శాఖలో 879 పోస్టులను క్రియేట్​చేస్తూ స్పెషల్​చీఫ్​సెక్రెటరీ రజత్ కుమార్​ఉత్తర్వులు జారీ చేశారు.

Update: 2022-12-14 17:12 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర నీటిపారుదల శాఖలో 879 పోస్టులను క్రియేట్​ చేస్తూ స్పెషల్​ చీఫ్​ సెక్రెటరీ రజత్ కుమార్ ​ఉత్తర్వులు జారీ చేశారు. ఇరిగేషన్‌లో కొన్ని పోస్టులను భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని ఇంజినీరింగ్​ పోస్టులకు అనుమతులు కూడా ఇచ్చారు. తాజాగా క్షేత్రస్థాయిలో 879 పోస్టులకు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఇవన్నీ దాదాపు 8 ఏండ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న పోస్టులే కావడం విశేషం. తెలంగాణ ప్రభుత్వంలో ఇరిగేషన్‌లో కిందిస్థాయి పోస్టులను భర్తీ చేయలేదు. దీంతో ప్రాజెక్టుల గేట్ల దగ్గర కూడా మెయింటనెన్స్​ లేకుండా పోయింది.

ఈ ఏడాది కురిసిన వానలతో ప్రాజెక్టులకు భారీ వరదలు రాగా.. కొన్ని ప్రాజెక్టుల గేట్లు తెరుచుకోలేదు. దీంతో మెయింటనెన్స్​ లేకపోవడమే కారణమని ఇంజినీర్లు విశ్లేషించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ పోస్టులను ప్రకటించింది. తాజాగా ప్రభుత్వం ప్రకటించిన పోస్టుల్లో వర్క్​ఇన్స్‌పెక్టర్లు 532, ఎలక్ట్రిషియన్స్​1‌‌09, ఫిట్టర్ 50, ఆపరేటర్లు 167, ల్యాబ్​అటెండెంట్​ 10, వైర్​లెస్ ​ఆపరేటర్లు 11 పోస్టులను క్రియేట్​ చేసినట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయా జిల్లాల వారీగా ఈ పోస్టులను ప్రకటించారు. అయితే, ఈ పోస్టులను వీఆర్‌ఏ, వీఆర్వోలతో భర్తీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల వీఆర్వోల సర్దుబాటు కారణంగా దాదాపు 200 మంది వరకు ఇరిగేషన్‌కు కేటాయించారు. వారికి ఈ పోస్టుల్లో అడ్జెస్ట్​ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

READ MORE

BEL- హైదరాబాద్‌లో 84 అప్రెంటిస్ ఖాళీలు 

Tags:    

Similar News