హైదరాబాద్ జంట నగరాల్లో కొత్తగా 40 పోలీస్ స్టేషన్లు

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ జంట నగరాల్లో కొత్తగా 40 పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

Update: 2023-05-06 14:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ జంట నగరాల్లో కొత్తగా 40 పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆరు కొత్త డీసీపీ జోన్లను నియమించింది. హైదరాబాద్‌లో 12 ఏసీపీ డివిజన్లు, సైబరాబాద్‌లో మూడు డీసీపీ జోన్లు ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. ప్రతి జోన్‌కు ఒక మహిళ పోలీస్ స్టేషన్ ఉంటుందని జీవోలో పేర్కొంది. కొత్తగా ఏర్పడిన 40 పీఎస్‌లలో 11 లా అండ్ ఆర్డర్, 13 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసింది. సైబరాబాద్‌లో సూరారం, జీనోమ్‌వ్యాలీ, కొల్లూర్, మోఖిల్లా, అల్లాపూర్‌లో కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. హైదరాబాద్‌లో సెక్రటేరియట్, దోమలగూడ, ఖైరతాబాద్, ఫిల్మ్ నగర్, మాసబ్ ట్యాంక్ ప్రాంతాల్లో కొత్త పీఎస్‌లు ఏర్పాటు కానున్నాయి.

Also Read:

మణిపూర్‌లో తెలంగాణ పౌరుల కోసం 24 గంటల హెల్ప్‌లైన్

Tags:    

Similar News