మాదాపూర్ లో 229కోట్ల భారీ మోసం

Update: 2024-10-11 06:46 GMT

దిశ, వెబ్ డెస్క్ : పెట్టుబడికి రెట్టింపు లాభాలు ఇస్తామని ఆశ చూపి రూ.229కోట్ల భారీ మోసం చేసిన వైనం తాజాగా వెలుగుచూసింది. మాదాపూర్ లో డీకేజెడ్ టెక్నాలజీస్, డికాజో సొల్యూషన్స్ పేరుతో ఎండీ సయ్యద్‌ అష్ఫక్ రాహిల్, అతని భార్య డైరెక్టర్‌ సయీదా అయేషాలు ప్రజలను మోసం చేసి రూ.229 కోట్లు కాజేశారు. రూ.లక్ష పెట్టుబడి పెడితే లక్ష లాభమని, మూడు నెలల్లో 15శాతం, ఆరు నెలల్లో 25శాతం, ఏడాదికి 65 శాతం, రెండేళ్ళకు 100శాతం లాభాలిస్తామని చెప్పి 17,500మంది బాధితుల నుంచి రూ.229 కోట్లను వసూలు చేసి బోర్డు తిప్పేశారు. గుడిమల్కాపూర్ కు చెందిన డాక్టర్ అబ్దు్ల్ జైష్ 2.74కోట్ల పెట్టుబడి పెట్టి మోసపోయానని గ్రహించి సెబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారు. బాధితులంతా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు.

బాధితుల ఫిర్యాదుతో కమిషనర్ సీ.వీ. ఆనంద్ ప్రత్యేక బ్యందాలతో దర్యాప్తుకు ఆదేశించారు. కంపనీ ఎండీ సయ్యద్‌ అష్ఫక్ రాహిల్, అతని భార్యను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 13ల్యాప్ టాప్ లు 1.7కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఏజెంట్లు ఇతరుల పాత్రపై ఆరా తీస్తున్నారు. 


Similar News