1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగాలివ్వాలి.. మంత్రి సబితకు డీఎస్సీ సాధన సమితి వినతి
1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేలా సీఎం కేసీఆర్‌తో మాట్లాడాలని 1998 డీఎస్సీ సాధన సమితి విజ్ఞప్తి చేసింది.
దిశ, తెలంగాణ బ్యూరో: 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేలా సీఎం కేసీఆర్‌తో మాట్లాడాలని 1998 డీఎస్సీ సాధన సమితి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని సాధన సమితి నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ విషయంపై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయించి న్యాయం జరిగేలా చూడాలని, అభ్యర్థులు తీవ్ర బాధలో ఉన్నారని మంత్రిని కోరారు. ఇటీవల కామరెడ్డి జిల్లాలో జరిగిన ఆత్మీయ సభలో మంత్రి హరీష్ రావుకు వినతి పత్రం అందజేసినట్లు గుర్తుచేశారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యమంత్రితో చర్చిస్తానని హామీ ఇచ్చినట్లు సాధన సమితి నాయకులు పేర్కొన్నారు. మంత్రిని కలిసిన వారిలో 1998 డీఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కె. శ్రీనివాస్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గంటా శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు ఎస్. యాదగిరి రెడ్డి, జర్నలిస్ట్ గోపు శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఖాసీం, ఆడెపు రవీందర్, రాష్ట్ర సహాయ కార్యదర్శులు నర్సయ్య, చెవ్వా సంపత్ తదితరులు పాల్గొన్నారు.