భారీ వర్షాలకు 16 మంది మృతి : మంత్రి శ్రీధర్ బాబు

గత రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు రాష్ట్రంలో అనేక ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

Update: 2024-09-02 11:59 GMT

దిశ, వెబ్ డెస్క్ : గత రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు రాష్ట్రంలో అనేక ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నేడు ఆయా ప్రాంతాల అధికారులతో మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు 8 జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నట్టు మంత్రి తెలిపారు. ఈ వర్షాలతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 16 మంది మృతి చెందినట్టు ప్రకటించారు. కాగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ.5 లక్షల నష్టపరిహారం అందిస్తామని పేర్కొన్నారు. ఇక అధికారులు ప్రతి క్షణం ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ తనకు సమాచారం అందజేయాలని ఆదేశించారు. పడిపోయిన విద్యుత్ స్తంభాలను వెంటనే సరిచేసి, తక్షణమే విద్యుత్ పునరుద్దరణ చేయాలని పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు. కాగా సోమవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావొద్దని ప్రజలకు సూచించారు. 


Similar News