Revanth Reddy: టార్గెట్ రేవంత్.. ఆ 12 మంది ఎమ్మెల్యేల రియాక్షన్ ఇదే!

కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేల విషయంలో టీపీసీసీ సంచలన నిర్ణయం తీసుకుంది.

Update: 2023-01-06 07:33 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేల విషయంలో టీపీసీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై విచారణ చేపట్టాలని కోరుతూ మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో టీపీసీసీ ఫిర్యాదు చేయబోతోంది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు టీపీసీసీ రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ భేటీ కానుంది. ఈ సమావేశానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సహా పలువురు సీనియర్లు హాజరు కానున్నట్టు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం నేతలు మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయనున్నారు. కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరిన ఆత్రం సక్కు, చిరుమర్తి లింగయ్య, రేగా కాంతరావు, హరిప్రియా, పి.సబితా ఇంద్రారెడ్డి, కందాల ఉపేందర్ రెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, హర్షవర్ధన్ రెడ్డి, జాజుల సురేందర్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డిలకు బీఆర్ఎస్ లో చేరిన తర్వాత ఎలాంటి ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు లభించాయి. ప్రభుత్వం నుంచి ఏయే పనులు చేయించుకున్నారు. వీరికి సంబంధించిన ల్యాండ్స్ ఎక్కడెక్కడ రెగ్యులరైజ్ అయ్యాయి.

వీరిని బీఆర్ఎస్ ఎలా ప్రలోభాలకు గురి చేసింది అనే వివరాలతో కూడిన ఫిర్యాదును పోలీసులకు అందించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభ పెట్టారనే కేసు ఎక్కడైతే నమోదైందో అదే మొయినాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి టీపీసీసీ తమ పార్టీని ఫిరాయించిన వారికి సంబంధించిన కేసును నడపాలని ప్రయత్నం చేయడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ హైకోర్టులో కీలక దశలో ఉంది. ఈ కేసులో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య వ్యవహారం హాట్ హాట్ గా సాగుతున్న పార్టీ ఫిరాయింపుల విషయంలోకి కాంగ్రెస్ ఎంటర్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారుతోంది. ఎమ్మెల్యేల ఎర కేసులో ప్రభుత్వం వెను వెంటనే స్పందించి సిట్ ను ఏర్పాటు చేసింది. దీంతో తమ ఫిర్యాదుపై ప్రభుత్వం ఏ మేరకు రియాక్ట్ అవుతుంది అనేది కీలకం కాబోతోందని కాంగ్రెస్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని తమ అస్త్రంగా మార్చుకునే వ్యూహంతో కాంగ్రెస్ మొయినాబాద్ స్టేషన్ ను ఎంచుకున్నట్టుగా పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో పలువురు ప్రస్తుతం కీలకమైన ప్రభుత్వ పదవుల్లో ఉన్నారు. వీరంతా పార్టీని వీడి చాలా కాలం అయినప్పటికీ కాంగ్రెస్ ఈ విషయంలో ఇప్పుడు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్​గా మారింది.

రేవంత్ రెడ్డికి సవాల్:

పార్టీ మారిన తమపై కాంగ్రెస్ చర్యలకు ఉపక్రమించాలని నిర్ణయించడంపై పార్టీ మారిన ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేల్లో ఒకరైన దేవిరెడ్డి సుధీర్ రెడ్డి టీపీసీసీ నిర్ణయంపై రియాక్ట్ అయ్యారు. గతంలో రేవంత్ రెడ్డి స్పీకర్ కు ఇవ్వాల్సిన రాజీనామా లేఖను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఇచ్చి కాంగ్రెస్ లో చేరారని ఆరోపించారు. ఆ తర్వాత కేవలం 20 రోజుల వ్యవధిలోనే నియోజకవర్గంలో ఎమ్మెల్యే హోదాలో ఇనాగ్రేషన్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొనలేదా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రజలను మభ్యపెట్టారని ధ్వజమెత్తారు. ముందు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చిన విధానంపై సమాధానం చెప్పాక తమ జోలికి రావాలని సూచించారు. తామంతా రాజ్యాంగబద్ధంగా బీఆర్ఎస్ లో విలీనం అయ్యామన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 10 షెడ్యుల్ 4 ప్రకారం తాము బీఆర్ఎస్ లో విలీనం అయ్యామని చెప్పారు. పార్టీ మారే విషయంలో దమ్ముంటే రేవంత్ రెడ్డి డిబేట్ కు రావాలని సవాల్ విసిరారు. అక్కడే చట్టబద్ధంగా పార్టీ మారింది ఎవరో నిరూపిస్తామన్నారు. గతంలో రేవంత్ రెడ్డి ఆర్థిక ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ లోకి వచ్చారా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఎప్పుడూ డ్రామా కంపెనీ నడుపుతాడని, పాదయాత్రకు ముందు ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నంలో భాగమే ఇదంతా అన్నారు. రెండు రోజుల తర్వాత ఈ వ్యవహారం అంతా సైలెంట్ అవుతుందన్నారు.

Also Read...

KTR, కలెక్టర్ నిర్లక్ష్యం వల్లనే సమస్య పెద్దదైంది: Revanth Reddy 

Tags:    

Similar News