'10 శాతం గిరిజన రిజర్వేషన్ లను వెంటనే అమలు చేయాలి'
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన 10 శాతం గిరిజన రిజర్వేషన్ లను కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి వెంటనే అమలు చెయ్యాలని గిరిజన విద్యార్ధి విభాగం డిమాండ్ చేసింది.
దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన 10 శాతం గిరిజన రిజర్వేషన్ లను కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి వెంటనే అమలు చెయ్యాలని గిరిజన విద్యార్ధి విభాగం డిమాండ్ చేసింది. ఇందులో భాగంగా సోమవారం గన్ పార్క్ వద్ద గిరిజన విద్యార్థి విభాగం నాయకుడు శ్రీను నాయక్ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. 2014 రాష్ట్ర పునర్ వ్యవస్తీకరణ చట్టం ప్రకారం కేటాయించిన గిరిజన విశ్వవిద్యాలయాన్ని వెంటనే ప్రారంభించాలని కోరారు. సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్బంగా గిరిజన విద్యార్థుల ద్వారా ప్రధానికి వెయ్యి పోస్ట్ కార్డులు పంపుతామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కాలేజీ, స్కూల్, యూనివర్సిటీ విద్యార్థులను ఏకం చేస్తూ రావాల్సిన రిజర్వేషన్ లు, వర్సిటీ ని సాధించుకుంటామన్నారు.