ఆ వార్తల్లో నిజం లేదు.. టూరిజం అంబాసిడర్ దేత్తడే..
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా బిగ్‌బాస్ ఫేమ్, దేత్తడి హారికనే ఉంటారని ఆ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త స్పష్టం చేశారు. హిమాయత్ నగర్‌లోని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఎండీ మనోహర్ రావుతో కలిసి మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. బ్రాండ్ అంబాసిడర్‌గా దేత్తడి హారికను తొలగించారని పలు మీడియా చానళ్లలో వస్తున్న వార్తలను ఖండించారు. దేత్తడి హారికను తొలగించారన్న వార్తల్లో నిజం […]
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా బిగ్‌బాస్ ఫేమ్, దేత్తడి హారికనే ఉంటారని ఆ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త స్పష్టం చేశారు. హిమాయత్ నగర్‌లోని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఎండీ మనోహర్ రావుతో కలిసి మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. బ్రాండ్ అంబాసిడర్‌గా దేత్తడి హారికను తొలగించారని పలు మీడియా చానళ్లలో వస్తున్న వార్తలను ఖండించారు. దేత్తడి హారికను తొలగించారన్న వార్తల్లో నిజం లేదన్నారు. తెలంగాణ టూరిజానికి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేలా సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ ల నాయకత్వంలో ముందుకు వెళుతున్నామన్నారు. అందు కోసమే టూరిజాన్ని ప్రమోట్ చేసుకునేందుకు తక్కువ ఖర్చుతో ప్రచారం చేస్తున్నామన్నారు.
ఈ నేపథ్యంలోనే దేత్తడి హారికను నియమించినట్లు చెప్పారు. ఈ విషయంలో మంత్రులు, ఉన్నతాధికారులను సంప్రదించే ముందుకు వెళ్లామన్నారు. ఐతే కొందరు గిట్టని వాళ్లు హారికను తొలగించినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని, ఇలాంటివి నమ్మొద్దన్నారు. తెలంగాణ టూరిజాన్ని నెంబర్ వన్ చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా దేత్తడి హారిక కొనసాగుతున్నారని స్పష్టం చేశారు.