సడలింపు ఇస్తే వైరస్ లేదన్న భ్రమలో ఉండొద్దు: ఈటల

దిశ, కరీంనగర్: కరోనా వైరస్ కంటిమీద కునుకు లేకుండా చేస్తోందని, అయినా ప్రజలను కాపాడుకుంటామని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్న మంత్రి ఈటల మాట్లాడుతూ మందు లేని ఈ మహమ్మారి సోక కుండా ఉండాలంటే స్వీయ నియంత్రణే దిక్కయిందన్నారు. కరోనా వైరస్‌తో అమెరికా, యూరప్ కంట్రీస్ కకావికలమయ్యాయన్నారు. మన దేశంలో అలాంటి పరిస్థితులు రావద్దని ముందుగానే కేంద్రం లాక్‌డౌన్ అమలు‌ చేసిందన్నారు. సడలింపు ఇచ్చామంటే అంటే […]

Update: 2020-06-02 03:50 GMT

దిశ, కరీంనగర్: కరోనా వైరస్ కంటిమీద కునుకు లేకుండా చేస్తోందని, అయినా ప్రజలను కాపాడుకుంటామని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్న మంత్రి ఈటల మాట్లాడుతూ మందు లేని ఈ మహమ్మారి సోక కుండా ఉండాలంటే స్వీయ నియంత్రణే దిక్కయిందన్నారు. కరోనా వైరస్‌తో అమెరికా, యూరప్ కంట్రీస్ కకావికలమయ్యాయన్నారు. మన దేశంలో అలాంటి పరిస్థితులు రావద్దని ముందుగానే కేంద్రం లాక్‌డౌన్ అమలు‌ చేసిందన్నారు. సడలింపు ఇచ్చామంటే అంటే వైరస్ లేదన్న భ్రమలో ఉండొద్దని హెచ్చరించారు. హైదరాబాద్‌కే పరిమితమైన ఈ వైరస్ పట్టణాలు, గ్రామాల్లో విస్తరిస్తే లక్షల్లో కేసులు నమోదు అవుతాయని, ప్రజలందరూ భౌతికదూరం పాటించాలని తప్పనిసరైతే తప్ప బయటకు రావొద్దని కోరారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని, పీహెచ్‌సీల్లో డాక్టర్లు ఉండాలన్న ఆలోచనతో వాహనాలను సమకూర్చామన్నారు. కరోనా పేషెంట్లకు ట్రీట్‌మెంట్ అందిస్తున్న డాక్టర్లు, నర్సులకు ఇతర సిబ్బందికి పాజిటివ్ వచ్చి ఐసోలేషన్‌కు వెళ్తే వైద్యానికి ఇబ్బంది కాకూడదని భావించిన సీఎం కేసీఆర్ ముందుచూపుతో డాక్టర్లు, నర్సులు ఇతర సిబ్బంది 3 వేల మందిని రిక్రూట్ చేయబోతున్నామని మంత్రి ఈటల ప్రకటించారు.

Tags:    

Similar News