బిగ్ న్యూస్.. థర్డ్‌వేవ్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
దిశ, తెలంగాణ బ్యూరో: థర్డ్‌వేవ్‌ను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. ఇతర దేశాల్లో వ్యాప్తి చెందుతున్న వైరస్రాష్ట్రంలో ప్రబలితే కట్టడి చేసేందుకు సర్కార్ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇంటింటికి ఒమిక్రాన్కిట్లు ఇచ్చేందుకు రెడీ అయింది. ఈ మేరకు 21 లక్షల హోం ఐసోలేషన్ కిట్లను స్టాక్పెట్టారు. దీంతో పాటు సెకండ్ వేవ్‌ను మించి 545 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సదుపాయం కలిగి ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే 27, 996లో 25,826 పడకలకు ఆక్సిజన్ […]
దిశ, తెలంగాణ బ్యూరో: థర్డ్‌వేవ్‌ను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. ఇతర దేశాల్లో వ్యాప్తి చెందుతున్న వైరస్రాష్ట్రంలో ప్రబలితే కట్టడి చేసేందుకు సర్కార్ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇంటింటికి ఒమిక్రాన్కిట్లు ఇచ్చేందుకు రెడీ అయింది. ఈ మేరకు 21 లక్షల హోం ఐసోలేషన్ కిట్లను స్టాక్పెట్టారు. దీంతో పాటు సెకండ్ వేవ్‌ను మించి 545 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సదుపాయం కలిగి ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే 27, 996లో 25,826 పడకలకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించడం పూర్తి కాగా, మిగతావాటికి కూడా వేగంగా ఆక్సిజన్ సౌకర్యం కల్పించాలని సర్కార్ఆదేశించింది.
అంతేగాక ప్రపంచం, దేశ వ్యాప్తంగా కరోనా, కొత్త వేరియంట్ వ్యాప్తి ప్రభావాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. వీరు ప్రతీ రోజు కరోనా పరిస్థితులను నివేదిక రూపంలో ప్రభుత్వానికి ఇవ్వాలి. ఇక కరోనాకు సంబంధించిన అత్యవసర మందులను గోడౌన్‌లలో అందుబాటులో ఉంచారు. కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ వేరియంట్, మూడో వేవ్ సన్నద్దత పై బీఆర్కే భవన్‌లో వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు మంగళవారం అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేరళ, మహారాష్ట్రలో కేసులు పెరుగుతున్నాయని, అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కట్టడి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కొత్త వేరియంట్ రూపంలో మూడో వేవ్ ప్రమాదం వచ్చినా, ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలన్నారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.
ప్రభుత్వాలకు తోడుగా ఉండాలి..
ప్రభుత్వాలకు తోడుగా, ప్రజలు వారి బాధ్యతలు నిర్వర్తించ వలసి ఉంటుందన్నారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ వేగాన్ని మరింత పెంచడం జరిగిందన్నారు. రెండో డోసు పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం తప్పక పాటించాలన్నారు. ఈ సమీక్షలో సీఎస్ సోమేష్ కుమార్, హెల్త్ సెక్రటరీ రిజ్వీ, డీఎంఈ రమేష్ రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్ర శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బార్డర్లలో మళ్లీ స్క్రీనింగ్..
ఏపీ, మహారాష్ట్రల్లో ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అంతరాష్ట్ర బార్డర్లలో మళ్లీ స్క్రీనింగ్, టెస్టులు నిర్వహించాలని ఆయా జిల్లాల వైద్యాధికారులకు అంతర్గత అదేశాలిచ్చింది. అవసరమైతే పక్క జిల్లాల సిబ్బంది సేవలను కూడా వినియోగించుకోవాలని సూచించింది. ఒమిక్రాన్వ్యాప్తి చెందకుండా మరిన్ని రోజులు అలర్ట్‌గా ఉండాల్సిన అవసరం ఉన్నదని ప్రభుత్వం నొక్కి చెప్పింది. మరోవైపు వీలైనంత వేగంగా వ్యాక్సినేషన్‌పూర్తి చేయాలని కోరింది.
కొత్త లక్షణాలుంటే..
కరోనా పాజిటివ్‌లలో జలుబు, దగ్గు, జ్వరం, నీరసంతో పాటు మరే కొత్త లక్షణం వచ్చినా సదరు పేషెంట్లను వేర్వేరు వార్డులలో ఉంచి చికిత్సను అందించాలని ఆరోగ్యశాఖ అన్ని ఆసుపత్రులకు సూచించింది. ముఖ్యంగా బ్లడ్మోషన్స్, లాంగ్ఫీవర్, విపరీతమైన ఒళ్లు, కీళ్ల నొప్పులు, కళ్లు తిరగడం, వాంతులు వంటివిని పరిగణలోకి తీసుకోవాలన్నది. వీరికి కరోనా వైద్యం అందిస్తూనే ఆరోగ్య పరిస్థితిని మానిటరింగ్చేస్తూ రిపోర్టులు తయారు చేయాలన్నారు. వైరస్ఎక్కువ రోజులు వేధిస్తే కేంద్ర ప్రభుత్వం సహాయంతో అవసరమైతే వేరియంట్లు నిర్ధారించే జీనోమ్సీక్వెన్సింగ్టెస్టులకు కూడా పంపించాలనుకుంటున్నారు. దీని వలన కొత్త వేరియంట్లు పుట్టుకను గుర్తించవచ్చని అధికారులు చెబుతున్నారు. ఒమిక్రాన్ ప్రవేశించినా తేలిపోతుందని అధికారులు భావిస్తున్నారు.