పోలీస్ ఆఫీసర్లు ఫిక్సయ్యారు.. ఏ అంశంలోనంటే!

జరిగేదేదో జరుగుతుంది. అది ఎపుడు ఎలా అనేది వాళ్లిష్టం. అసలు జరుగుతుందా, లేదా? అన్నదీ ఆ ప్రభువుకే ఎరుక. మధ్యలో మనకెందుకూ? వినీవినీ ఆ సబ్జెక్టు మరీ బోరైపోయింది.. అని అనుకునేపుడల్లా ఇదిగో, ఇట్లా కొత్త కోణాల్లో గెస్సులు ఫ్లో అవుతున్నాయి. ప్రస్తావించకుండా ఉండలేకపోతుంటాయి. చూడబోతే, మేటరు చిన్నదేమీ కాదు. రాష్ట్రాన్నే ప్రభావితం చేసేదాయే. కాబట్టి, మనమూ వినాలి, కనాలి, అంటారా! అయితే, విషయంలోకి చలో! ప్రభుత్వమన్నాక పాలకులకు అనేక హంగులుంటాయి. బయటకు కనిపించేవీ, కనిపించని సోర్సులుంటాయి. […]

Update: 2020-03-02 09:03 GMT

జరిగేదేదో జరుగుతుంది. అది ఎపుడు ఎలా అనేది వాళ్లిష్టం. అసలు జరుగుతుందా, లేదా? అన్నదీ ఆ ప్రభువుకే ఎరుక. మధ్యలో మనకెందుకూ? వినీవినీ ఆ సబ్జెక్టు మరీ బోరైపోయింది.. అని అనుకునేపుడల్లా ఇదిగో, ఇట్లా కొత్త కోణాల్లో గెస్సులు ఫ్లో అవుతున్నాయి. ప్రస్తావించకుండా ఉండలేకపోతుంటాయి. చూడబోతే, మేటరు చిన్నదేమీ కాదు. రాష్ట్రాన్నే ప్రభావితం చేసేదాయే. కాబట్టి, మనమూ వినాలి, కనాలి, అంటారా! అయితే, విషయంలోకి చలో! ప్రభుత్వమన్నాక పాలకులకు అనేక హంగులుంటాయి. బయటకు కనిపించేవీ, కనిపించని సోర్సులుంటాయి. ఇంటెలిజెన్సు వ్యవస్థ మినిట్ టు మినట్ సర్కారుకు రిపోర్టు చేస్తుంటుంది. ఓవరాల్ స్టేట్ సిట్యుయేషన్‌ను ఆ వింగ్ బాస్ సీఎంకు డెయిలీ బ్రీఫ్ చేస్తారు. ఒక రకంగా కళ్లూ, చెవుల్లా! ఆ ఇంటెలిజెన్సు సిస్టం బేసిగ్గా ఎక్కడిదంటే, పోలీసు శాఖలోనిదే. సర్కారు కదలికలు, వ్యూహ రచనలూ, ఫ్యూచర్ ప్లాన్లూ పోలీసు పెద్దలకు తెలుస్తూనే ఉంటాయి. సరిగ్గా, యువనేతకు పట్టాభిషేకమూ అంతే! అసెంబ్లీ బడ్జెట్ మీటింగ్స్ ఈ నెల 6న చాలవుతాయి. ఆ తర్వాత ఏదో ముహూర్తాన కేటీఆర్ సీఎం అవడం ఖాయమనే టాక్ పోలీసు ఆఫీసర్లలోనూ అంతర్గతంగా ధ్వనిస్తోంది. జిల్లా, డివిజన్ స్థాయి పోలీసు అధికారులూ అనేక చోట్ల అలానే ఫిక్సయ్యారట. నమ్మకస్తులతో ఇదే సంగతిని ఆసక్తి, ఉబలాటాల మేళవింపుతో షేర్ చేసుకుంటున్నారు. కేటీఆర్ సీఎం అవుడు అవుడే, ఎపుడనేది చూడాలి బై! అని దగ్గరి వారితో అనేస్తున్నారు.

ఆ టాక్‌కు ఇది సపోర్టు కాదా?

ఏ విభాగంలోనైనా పైన జరిగే ఆఫ్ ది రికార్డు చర్చ నెమ్మదిగానైనా ఫీల్డు దాకా చేరుతుంది. ఈ నోటా ఆ నోటా వ్యాప్తిలోకి వస్తుంది. తెలంగాణలో ముఖ్యంగా కొందరు యువ ఐపీఎస్‌లు సోషల్ మీడియాపట్ల ఇంట్రెస్ట్ పెంచుకుంటున్నారు. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సాంఘిక/సామాజిక వేదికల్లో మినిస్టర్ కేటీఆర్ చురుగ్గా ఉంటారు. ఎప్పటికపుడు ఎన్నో విశేషాలను నెటిజన్లతో పంచుకుంటారు. వేలు, లక్షల్లో స్పందనలు పోటెత్తుతుంటాయి. సరిగ్గా ఈ ట్రెండే ఎస్పీలు, ఇతర పోలీసు ఆఫీసర్లు పలువురిని అట్రాక్ట్ చేస్తున్నది. కేటీఆర్‌ మెచ్చుకునేలా మెసేజెస్ చేయాలని తాపత్రయపడుతున్నారు. యంగ్ లీడరుకు నచ్చేలా ఉండాలని ఆరాటపడుతున్నారు. అందుకు ఏకంగా ఏజెన్సీల సేవల్ని వాడుకునేందుకు వెనుకాడడం లేదట. ఆ సర్వీసుకు రూ.లక్షల్లో చెల్లించడానికి రెడీ అంటున్నారట. ఆ ఒప్పందాల్లో నిజానిజాలెలా ఉన్నా.. ఇంతకీ కేటీఆరే కితాబివ్వాలని వారు ఎందుకు తండ్లాడుతున్నట్టు? ఆయన మదిలోనే సెటిలవ్వాలని మరెందుకు తలపోస్తున్నట్టు? పోలీసు రిలవెంటు శాఖైన హోం మంత్రి కూడా కాదాయే. మరి ఎందుకన్నట్టు? పై పేరాలో చెప్పుకొన్నదాన్నిబట్టి, అర్థమవుతోంది కదా! సమీప భవిష్యత్తులో కేటీఆర్ కాబోయే సీఎం అని గట్టిగా ఫిక్సయ్యారన్నమాట. లేదంటే, ప్రభుత్వ పాలనాచక్రాన్ని తానే తిప్పుతున్నారని బలంగా గురి కుదిరైనా ఉండి ఉండాలి. అంతే కదా. ఏమంటారూ!

Tags : telangana police department, young ips officers, social media, ktr, cm post.

Tags:    

Similar News