అడ్డంగా బుక్కైన తెలంగాణ మంత్రులు… వివాదాస్పదంగా మారిన వ్యవహారం
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర మంత్రుల వ్యవహారం వివాదాలకు తావిస్తోంది. గతంలో నిషేదిత గుట్కా తీసుకుంటూ కెమెరాకు చిక్కి బుక్కైన మంత్రులు.. తాజాగా హుజురాబాద్‌లో నిర్వహించిన ర్యాలీ విమర్శలకెక్కింది. ప్రధానంగా నెటిజన్లు ఈ ఫొటోలతో అడుకుంటున్నారు. హుజురాబాద్‌లో గతంలో మాస్కులు లేకుండా తిరిగిన వారికి రూ. 1000 జరిమానా విధించిన పోలీసులు.. మంత్రులను ఎందుకు వదిలేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హుజురాబాద్‌లో మంత్రులు విచ్చలవిడిగా.. కనీసం మాస్కులు లేకుండా తీసిన ర్యాలీ […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర మంత్రుల వ్యవహారం వివాదాలకు తావిస్తోంది. గతంలో నిషేదిత గుట్కా తీసుకుంటూ కెమెరాకు చిక్కి బుక్కైన మంత్రులు.. తాజాగా హుజురాబాద్‌లో నిర్వహించిన ర్యాలీ విమర్శలకెక్కింది. ప్రధానంగా నెటిజన్లు ఈ ఫొటోలతో అడుకుంటున్నారు. హుజురాబాద్‌లో గతంలో మాస్కులు లేకుండా తిరిగిన వారికి రూ. 1000 జరిమానా విధించిన పోలీసులు.. మంత్రులను ఎందుకు వదిలేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హుజురాబాద్‌లో మంత్రులు విచ్చలవిడిగా.. కనీసం మాస్కులు లేకుండా తీసిన ర్యాలీ ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
కొంతమంది తమకు వేసిన ఫైన్లను వివరిస్తూ మంత్రులకు కూడా జరిమానా వేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో మంత్రులు మళ్లీ వివాదంలో చిక్కినట్లు అయింది. మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌తో పాటు పలువురు టీఆర్ఎస్ నేతల ఫోటోలను నెట్టింటా వైరల్ చేస్తున్నారు.
హుజూరాబాద్ గడ్డ మీద మంత్రి శ్రీ హరీష్ రావు గారికి ఘన స్వాగతం #HuzurabadWithTRS @trsharish @trspartyonline pic.twitter.com/XOycABcexe
— Harish Rao News (@TrsHarishNews) August 11, 2021